![ACB Enquiry On MP Revanth Reddy Documents In Keesara MRO Case - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/27/MP-Revanth-Reddy.jpg.webp?itok=TLUYTvz-)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర ఎమ్మార్వో కోటి రూపాయల లంచం కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ గురువారం ‘సాక్షి మీడియా’తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. కీసర అవినీతి కేసులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. అంజిరెడ్డి ఆ డాక్యుమెంట్లు రేవంత్‌రెడ్డికి చెందినవిగా ఒప్పుకున్నారని, ఈ డాక్యుమెంట్లుపై విచారణ జరిపామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. మరోసారి రేవంత్, అంజిరెడ్డి పత్రాలపై విచారణ జరుపుతామని తెలిపారు. (కీసర తహశీల్దార్ కేసులో విచారణ వేగవంతం)
రేవంత్ పాత్ర ఉందని తేలితే అతన్ని కూడా పిలిచి విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఎలాంటి స్పష్టత రాలేదని, ఏసీబీ విచారణకు నిందితులు సహకరించలేదని చెప్పారు. తహసీల్దార్ నాగరాజు, ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ల వ్యవహారంపై తమని తప్పుతోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడని సూర్యనారాయణ వెల్లడించారు. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్)
Comments
Please login to add a commentAdd a comment