సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంçస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం సా యంత్రం ఆరున్నర గంటల నుంచి డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే వేడుకల్లో గాయకులు మంగ్లీ, హేమచంద్ర సహా తెలంగాణకు చెందిన జానపద కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో భాగంగా హరియాణా రాష్ట్ర పాఠశాల విద్యార్థులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మార్చి 12న 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు 75 వారాల కౌంట్‌డౌన్‌తో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు 2023 ఆగస్టు 15న ముగుస్తాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment