CM KCR to inaugurate BRS office in Delhi on May 4th - Sakshi
Sakshi News home page

ఢిల్లీ సిగలో ‘గులాబీ’.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Published Wed, May 3 2023 3:14 PM | Last Updated on Wed, May 3 2023 3:33 PM

CM KCR To Inaugurate BRS Office in Delhi On May 4th - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఐదు అంతస్తుల్లో నిర్మితమై న ఈ భవనాన్ని ఈ నెల 4న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం వాస్తు పూజతోపాటు సుదర్శ న హోమం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు కేసీఆర్‌ ఈ భవనాన్ని ప్రారంభిస్తారు.

ఆంక్షలతో ఆలస్యం
ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 2021 సెప్టెంబర్‌ 2న కేసీఆర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఏడాదిన్నరగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ నిర్మాణ సంస్థపై ఒత్తిడి పెంచుతూ పనులు వేగంగా జరిగేలా చూశారు. బీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

ఐదంతస్తుల్లో 20 వేల చదరపు అడుగులు
మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్‌ గ్రౌండ్‌లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్‌తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్‌ గ్రౌండ్‌లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్‌, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్‌ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్‌, పేషీ, కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్‌ రూమ్‌లను సిద్ధం చేశారు. సూట్‌ రూమ్‌లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement