![CM KCR Order To Abolish VRA System Entirely Pay Scale Orders Released - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/pay-scale.jpg.webp?itok=zb6Slped)
సాక్షి, హైదరాబాద్: వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారి పేస్కేల్ విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం సచివాలయంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
(మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్)
కాగా నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా(వీఆర్ఏ) పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం పేర్కొన్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ, వారికి పే స్కేలు అమలు పరుస్తున్నట్లు తెలిపారు.
చదవండి: TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
తమకు 'పే స్కేలు' నిర్ణయించి ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు సచివాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏ జేఏసీ నేతలు. pic.twitter.com/19qJReFhdo
— Telangana CMO (@TelanganaCMO) July 23, 2023
Comments
Please login to add a commentAdd a comment