సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తే పేరును మారుస్తామన్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘సురవరం ప్రతాపరెడ్డికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. వారి అభ్యర్థన మేరకు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున నేను సురవరం పేరును ప్రతిపాదిస్తున్నాను. సభలో అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఆమోదం అయితే పేరును మారుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment