రైతు రుణమాఫీ పూర్తి చేయండి: సీఎం కేసీఆర్‌ ఆదేశం | Complete Farmer Loan Waiver CM KCR Orders | Sakshi
Sakshi News home page

రైతు రుణమాఫీ పూర్తి చేయండి: సీఎం కేసీఆర్‌ ఆదేశం

Published Wed, Aug 2 2023 8:20 PM | Last Updated on Wed, Aug 2 2023 8:32 PM

Complete Farmer Loan Waiver CM KCR Orders - Sakshi

సాక్షి హైదరాబాద్‌: రైతు రుణమాఫీ పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రేపట్నుంచి(ఆగస్టు3వ తేదీ) రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్‌లో బుధవారం  ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్‌.  తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా  రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు, తదితర కారణాల వల్ల  ఆర్థికలోటుతో ఇన్నాళ్లు రైతు రుణమాఫీ కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.  రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement