![Corona For Two Other Of Those From The UK - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/27/new-corona.jpg.webp?itok=cVjnXqgg)
సాక్షి, హైదరాబాద్: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 20 మందిని వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులో అధికారులు ఉంచారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని చేపట్టారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి 1,216 మంది రాగా, వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంకా 154 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. (చదవండి: ‘బ్రిటన్’ భయం!)
Comments
Please login to add a commentAdd a comment