కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం | CoronaVirus Patient Deceased In Karimnagar Government Hospital Due to Doctors Negligence | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

Jul 26 2020 8:36 PM | Updated on Jul 26 2020 9:12 PM

CoronaVirus Patient Deceased In Karimnagar Government Hospital Due to Doctors Negligence - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్‌పై నుంచి కిందపడి మృతిచెందాడు. బెడ్‌పై నుంచే కిందపడటంతో ఆక్సిజన్‌ అందక ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి కిందపడి ఆక్సిజన్‌ అందక గిలగిలా కొట్టుకున్న సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని అదే వార్డులోని మరో పెషేంట్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా బయటకు సమాచారం అందించాడు. అలాగే అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంపాడు. బాధితుడు బెడ్‌పై నుంచి కిందపడిన విషయాన్ని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని, అటువైపు కన్నెత్తి కూడా చూడ లేదని తెలిపాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధితుడు కిందపడి మృతిచెందిన తర్వాత.. మృతదేహాన్ని మంచంపైకి చేర్చి ఆక్సిజన్‌ పెట్టారని చెప్పారు. ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement