హైదరాబాద్: ఫారెస్ట్ ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. కాగా, ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి.. గీత నారాయణ్ పేరుతో పరిచయం చేసుకుని, నగరానికి చెందిన సదరు వ్యక్తికి కుచ్చుటోపి పెట్టారు. అమెరికాలో ఖరీదైన ఆయిల్ వ్యాపారం చేస్తున్నామని నమ్మించారు. అంతటితో ఆగకుండా.. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రోసీడ్ ఆయిల్ సరఫరా చేస్తామనంటూ తెలిపారు.
బాధితుడి నుంచి విడతల వారీగా రూ.11 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment