రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్‌ సారథి’ | Driving Licenses and RCs in Vahan Sarathi | Sakshi
Sakshi News home page

రవాణాశాఖ సేవలకు ఇక ‘వాహన్‌ సారథి’

Published Thu, Sep 12 2024 4:55 AM | Last Updated on Thu, Sep 12 2024 4:55 AM

వాహన్‌ సారథిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్సీలు 

ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరణ, చిరునామా బదిలీ 

లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే 

గ్రేటర్‌ లైసెన్స్‌లన్నీ సారథిలో నిక్షిప్తం 

ఈ నెలాఖరులో సికింద్రాబాద్‌ ఆర్టీఏలో అమలు 

దశలవారీగా అన్ని ఆర్టీఏలకు విస్తరణ 

జాతీయ సమాచార కేంద్రంలో వాహనాలు, లైసెన్స్‌ల వివరాలు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు ద్వారా కొన్ని సేవలు నేరుగా, మరికొన్ని పరోక్షంగా లభిస్తున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రెన్యువల్స్, వాహనాల నమోదు బదిలీ వంటి పౌరసేవలను వాహన వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆర్టీఏ సన్నాహాలు చేపట్టింది. 

దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నింటిపైన ఏకీకృత విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన వాహన్‌ సారథిని గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం టీ–యాప్‌ ఫొలియో వంటి మొబైల్‌ యాప్‌ల ద్వారా ప్రత్యక్ష సేవలను పొందేందుకు అవకాశం ఉండగా త్వరలో వాహన్‌ సారథిని వినియోగించుకొనే సదుపాయం అందుబాటులోకి రానుంది. 

ఈ మేరకు వాహనాల వివరాలన్నింటినీ వాహన్‌లోనూ, వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌ల వివరాలను సారథిలోనూ నిక్షిప్తం చేయనున్నాయి. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ సమాచారం కేంద్రం (నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ ) ద్వారా ఈ వివరాలన్నింటినీ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

మొదట లైసెన్స్‌ల డేటా నమోదు 
సికింద్రాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ల వివరాలు సారథిలో నమోదయ్యాయి. ఇటీవల తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో కొత్తగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకొనే అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యువల్స్‌ చేసుకోవడం, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. 

ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) పొందాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్స్‌ల మొత్తం డేటా సారథిలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఈ సర్విసులను పొందే అవకాశం ఉంటుంది. 

కానీ అధికారుల పర్యవేక్షణ, ఆమోదంతోనే సర్విసుల బదిలీ సదుపాయం లభించనుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లోనే నిరీ్ణత ఫీజు చెల్లించి డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతంగ్రేటర్‌ హైదరాబాద్‌లోని 3 జిల్లాల పరిధిలో 62,7056 లైసెన్స్‌లు ఉన్నాయి. సుమారు 83 లక్షల వాహనాలు నమోదై ఉన్నాయి. 
 
వాహనాల నమోదుకు ‘వాహన్‌’ 
ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వాహనాల వివరాలను ‘వాహన్‌’లో నమోదు చేశాయి. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వాహన్‌’లో ఇటీవల తెలంగాణ కూడా చేరేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం వాహనాల డేటాను వాహన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. దీనిద్వారా వాహనం కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్‌లలో శాశ్వత రిజి్రస్టేషన్‌ సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఆటోమొబైల్‌ డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పత్రాలను (టీఆర్‌) ఇస్తున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ (ఆర్‌సీ) చేస్తున్నారు. 

మరోవైపు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాన్ని బదిలీ చేసేందుకు ఎన్‌ఓసీల అవసరం ఉండదు. సదరు వాహనం వివరాలను ‘వాహన్‌’లో ధ్రువీకరించుకుని బదిలీ చేయవచ్చు. అలాగే ప్రమాద బీమా సదుపాయం కూడా తేలిగ్గా లభిస్తుందని అధికారులు చెప్పారు. వాహనాల సామర్థ్య పరీక్షలను కూడా ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ల ద్వారా నిర్వహించడంతో పాటు ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.  

ఆన్‌లైన్‌లోనే లెరి్నంగ్‌ పరీక్షలు 
ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతున్న దృష్ట్యా హైదరాబాద్‌లోనూ ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ పద్ధతిని అమలు చేయాలనే రవాణా అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల విని యోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవస రం ఉండదు. 

ఇంటి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌ (లెర్నింగ్‌ లైసె న్స్‌) పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మరో నెల వరకు పొడిగించుకొనే సదుపాయం ఉంటుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం మాత్రం టెస్ట్‌ట్రాక్‌లలో అధికారులు నిర్వ హించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement