![FlipKart Delivery Address Going Viral On Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/16/social-media.jpg.webp?itok=Gvkoq-ol)
హైదరాబాద్ : ప్లిప్‌కార్ట్ డెలివరీ అడ్రస్‌కు సంబంధించిన ఓ ఫొటో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అడ్రస్‌ను ఇలా కూడా రాయోచ్చా అని అనిపించేలా ఉన్న అది ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సలీమ్ లాలా అనే వ్యక్తి తను ఆర్డర్ చేసుకున్న వస్తువు కోసం అడ్రస్‌ను ఇలా రాశాడు.. ‘‘ సలీమ్ లాలా ఎక్కడ ఉంటాడో పాశా భాయ్ దుకాణం దగ్గరకు వచ్చి అడగండి. సరాసరి ఇంటి దగ్గరకు తెచ్చి దించుతాడు’’ అని రాసి ఉంది. ఈ ఫొటో 17 వేలకు పైగా లైకులు సంపాదించుకుంది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు .. ‘‘ అడ్రస్ చెప్పిన విధానం అద్భుతంగా ఉంది’’.. ‘‘ ఇలా కూడా అడ్రస్ రాయోచ్చా’’.. ‘‘నవ్వు ఆపుకోలేకపోతున్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ అని తేలిపోయింది. ఇందుకు సంబంధించిన ఒరిజినల్ ఫొటో 2020 జులైలో వైరలైంది. అది కూడా అంతే ఫన్నీగా ఉంది. ‘‘ గుడి దగ్గరకు రాగానే ఫోన్ చేయండి! వచ్చేస్తాను’’ అని ప్యాకెట్ అడ్రస్ మీద ముద్రించి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment