
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు గిఫ్ట్‌బాక్సులు ఇచ్చే సంస్కృతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పండగకు వారం పది రోజుల ముందు నుంచే గిఫ్ట్ బాక్స్‌లను వారికి పంపిస్తుంటారు. దీంతో బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్‌లో డ్రైఫ్రూట్స్ బాక్సుల విక్రయాలు జోరందుకున్నాయి. అందమైన ప్యాక్‌లలో డిజైన్ చేసి 250, 500, 750 గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.250 నుంచి రెండు మూడు వేల వరకు అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్యాకింగ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఉద్యోగులను విధుల్లోకి అనుమతిస్తున్నారు.
విక్రయాలు ఊపందుకున్నాయి
ఉత్తరాది రాష్ట్రాల్లో పండగ పూట గిఫ్ట్‌లు ఇచ్చే సంస్కృతి ఉంది. ప్రస్తుతం నగరంలో కూడా ఉద్యోగులు, వ్యాపారులు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. నగర ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వివిధ సైజుల్లో ఆకర్శణీయమైన ప్యాకింగ్‌లతో డిజైన్ చేసి విక్రయిస్తున్నాం. ఇప్పటికే విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున గిఫ్ట్ బాక్సులను తీసుకెళ్తున్నారు.
- రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని