
సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది మద్దికుంట లింగం నారాయణ ఎన్నికయ్యారు. మార్చి 5న (శుక్రవారం) హొరా హోరిగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అత్యధికంగా 535 ఓట్లు సాధించి ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షులుగా ఎన్. నాగభూషణం, జి. శ్రీలత ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఈ. కిశోర్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎం. మురళీ మోహన్ గెలిచారు.
నాయీ బ్రాహ్మణుల హర్షం
160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిటీ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది మద్దికుంట లింగం నాయీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment