స్ట్రిక్ట్ ఆర్డర్స్: హద్దు దాటితే చర్యలు తప్పవు | Hyderabad Police Warning To Drunk And Drivers | Sakshi
Sakshi News home page

తాగి బండి నడిపితే చర్యలు..

Dec 27 2020 7:47 PM | Updated on Dec 27 2020 8:30 PM

Hyderabad Police Warning To Drunk And Drivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాగి బండి నడిపితే చర్యలు తప్పవని హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వారి పనిచేసే  ఆఫీసులకు సమాచారం అందిస్తామని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌ నెలలోనే 2,351 కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది 3,287 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement