
మల్కాజిగిరి(హైదరాబాద్): తల్లీ ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమేశ్‌కుమార్ శర్మ తన భార్య శీతల్ (36) కూతురు అలేఖ్య(11), కుమారుడు ఆదిత్య (9)తో కలిసి మల్లికార్జుననగర్‌లో నివాసముంటున్నాడు. ఈనెల 11న శీతల్ పిల్లలను తీసుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పింది.
అదేరోజు ఉమేశ్‌కుమార్ తన స్వస్థలం ఒడిస్సాకు వెళ్లి అక్కడినుంచి తల్లితో కలిసి మహాకుంభమేళాకు వెళ్లి ఈనెల 15 న తిరిగి వచ్చాడు. భార్య పిల్లలు లేకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. తెలిసిన వారు పలుప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి..
అల్వాల్: వ్యక్తి అదృశ్యమైన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధీనదయాల్‌నగర్‌లో నివసించే కావల శ్యామ్ (42)కి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో మద్యం తాగి రాగా భార్య అనురాధా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్యామ్ ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment