సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని, పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఎమ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్‌లపైనా కూడా ధర్మాసనం విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ ఏజీ తెలిపారు. 3 నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదన్న ఏజీ.. వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్.. పిటిషన్లను పరిశీలించలేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment