
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి కేటీ రామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములుతో శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు.నేటి యువతరం మేఘనను ఆ దర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment