సాక్షి, హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మీదుగా ఓఆర్‌ఆర్ వెళ్లేందుకు ఎంతో అనువైన శిల్పా లే ఔట్ ఫ్లై ఓవర్‌ను శుక్రవారం మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 45 నుంచి ఐకియా మీదుగా ఈ కొత్త ఫ్లై ఓవర్ ద్వారా నేరుగా ఓఆర్‌ఆర్‌కు.. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికీ ఈజీగా చేరుకోవచ్చు.
దీనిద్వారా గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లో రద్దీ సమయంలో పదివేల వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నాలెడ్జి సెంటర్(హెచ్‌కేసీ), పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఎంతో సదుపాయం. హైటెక్ సిటీ, హెచ్‌కేసీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు (పంజగుట్ట), ఔటర్ రింగ్‌రోడ్డుకు(గచ్చిబౌలి) కూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌లో లగ్జరీ వాహనాల క్రేజ్.. రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు
గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వ్యయం.. భూసేకరణ, టీడీఆర్‌లతో సహా రూ.466 కోట్లు. ఫ్లై ఓవర్ పొడవు 2,810 మీటర్లు. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment