
సాక్షి, హైదరాబాద్: శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణశాఖ సూచించింది. మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతా ల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండురోజులు ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముంది.

శుక్రవారం ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే నిజామాబాద్‌లో 41.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 24 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు సమీప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సూచించింది. ఆ తర్వాత రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment