
సాక్షి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశంలో కలెక్టర గౌతమ్‌తో సహా.. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. అధికారల సూచనలతో వారంత పరీక్షలు చేయించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment