సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రిలో రెమిడిసివిర్ ఇంజెక‌్షన్‌ల కొరత లేదు అని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెంది ప్రైవేటు ఆస్పత్రులకు పరిగెతొద్దు అని సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లలో రూ.2,500 లకే ఛాతీ స్కాన్ తీసేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్‌లు ఏజెన్సీ నుంచి ఎన్ని వస్తున్నాయో లెక్కలు బోర్డు మీద చూపించాలని సూచించారు.
కరీంనగర్‌లో 31 ప్రయివేటు ఆస్పత్రులకు రెమిడిసివిర్ ఇంజెక్షన్‌లు సరఫరా అవుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులలో ఫీజుల నియంత్రణ లేదు, కచ్చితంగా అమలయ్యేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా అధికారులు సేవలు అందించాలని సూచించారు. ఇంజెక్షన్‌లు, ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా చూడాలి అని కోరారు.
చదవండి: ‘కోవిషీల్డ్’ డోసులలో కీలక మార్పులు
చదవండి: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment