
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తొర్రూరు(వరంగల్ రూరల్) : బాల్య వివాహం జరగగా, జంటకు కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో పారిపోయిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంట తండాలో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన మైనార్టీ తీరని బాలికతో అదే తండాకు చెందిన బాలుడికి వివాహం జరిగింది.
ఈ మేరకు చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులు వెళ్లి బాల్య వివాహం వల్ల భవిష్యత్‌లో వచ్చే నష్టాలపై వివరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇప్పటికే తప్పు జరిగినందున, సరైన వయస్సు వచ్చిన తర్వాతనే వారిద్దరు కలిసి ఉండేలా చూడాలని సూచించారు. ఇలా కౌన్సెలింగ్ ఇస్తుండగానే వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment