![RS 22. 301 crores to the Irrigation Department: Telangana](/styles/webp/s3/article_images/2024/07/26/water_0.jpg.webp?itok=jz7NHUpm)
గతేడాదితో పోల్చితే తగ్గిన నిధుల ప్రవాహం
నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్ల కేటాయింపులు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.10,829 కోట్ల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2023–24 బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు ఇవ్వగా, 2024–25 బడ్జెట్‌లో రూ.22,301 కోట్లే కేటాయించారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన రుణాల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,829 కోట్లు కేటాయించింది. గతేడాది వీటికి రూ.9381 కోట్లు మాత్రమే ఇచ్చారు.
ప్రాథమ్యాలకు నిధుల కరువే..
రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై 2024–25లో రూ.19,287 కోట్లు ఖర్చు చేయాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసు కోగా, బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జర పలేదు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.10,829 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులు కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లనున్నాయి.
![](/sites/default/files/inline-images/ts222.jpg)
రుణాల చెల్లింపులకు నిధుల కోత..
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ డబ్ల్యూఆర్‌ఐడీసీ)తో పాటు ఇతర మార్గాల ద్వారా రుణా లను సమీకరించింది. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి 2023–24 బడ్జెట్‌లో రూ.15,773 కోట్లు ప్రతి పాదించగా, తాజా బడ్జెట్‌లో రూ.9951 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది.
కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.12, 500 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.6914.54 కోట్లకు కేటాయింపులు తగ్గాయి. ఇక టీఎస్ డబ్ల్యూఆర్ ఐడీసీకి కేటాయింపులు రూ.3200కోట్ల నుంచి రూ.2962. 47 కోట్లకు తగ్గాయి. ఈ రుణాల తిరిగి చెల్లింపుల గడువును పొడిగించి వాటి కిస్తీల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణా ల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను కోత పెట్టింది.
కేటగిరీల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..
భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.8476.48 కోట్లు
మధ్య తరహా ప్రాజెక్టులకు రూ.953.21
మైనర్ ఇరిగేషన్‌కు రూ.857.73
వరదల నియంత్రణ, డ్రైనేజీ రూ.282.24
Comments
Please login to add a commentAdd a comment