పైలట్ ప్రాజెక్టుగా కొండారెడ్డిపల్లె
అటవీ భూములు, ఖాళీ స్థలాల్లో సౌర విద్యుదుత్పత్తికి చర్యలు
మహిళలకు ఎ ల్పిజీకి బదులుసోలార్ సిలిండర్లు
విద్యుత్ శాఖపై సమీక్షలోసీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఉచితంగా సోలార్ పవర్ పంప్‌సెట్లను పంపిణీ చేసి, సౌర విద్యుత్ వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తన సొంత గ్రామం కొండారెడ్డి పల్లెను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. సోలార్ పవర్‌తో వచ్చే విద్యుత్‌ను రైతు పంప్‌సెట్లకు వాడుకోగా మిగిలే విద్యుత్‌తో వారికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
బుధవా రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్‌గా మారబోతోందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యు త్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు గాను ఐటీ, పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్య లు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించిన వినియోగంలో లేని ఖాళీ భూములతో పాటు అటవీ భూముల్లో సౌర విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్పీ జీ గ్యాస్ సిలిండర్‌కు బదులుగా మహిళలు సోలార్ సిలిండర్ వినియోగించేలా ప్రోత్సహించాలని చెప్పారు.
మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా సోలార్ సిలిండర్ వ్యాపారం వైపు వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కూడా విద్యు త్ సరఫరాలో అంతరాయం కలగకూడదని, ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment