బీఎస్సీ హెల్త్‌ సైన్సెస్‌ ఫీజు రూ.15వేలు! | Telangana: BSc Health Sciences Courses Fee Rs 15 Thousand | Sakshi
Sakshi News home page

బీఎస్సీ హెల్త్‌ సైన్సెస్‌ ఫీజు రూ.15వేలు!

Jan 2 2023 1:49 AM | Updated on Jan 2 2023 8:48 AM

Telangana: BSc Health Sciences Courses Fee Rs 15 Thousand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెట్టబోయే బీఎస్సీ హెల్త్‌ సైన్సెస్‌ కోర్సులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. నాలుగేళ్ల ఈ హెల్త్‌సైన్సెస్‌ కోర్సులను గాంధీ, ఉస్మానియా సహా 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెడుతున్నారు.

కొత్త కోర్సులు కావడంతో వీటికి మరింత డిమాండ్‌ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలేజీలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు రూ. 6వేలు కాగా, విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే మూడేళ్లకు రూ.45 వేల ఫీజు ఉండొచ్చు. మరో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. చివరి ఏడాదిలో విద్యార్థులకే స్కాలర్‌షిప్‌ ఇస్తారు.

ఫీజు వివరాలను త్వరలో వెల్లడిస్తామని వర్సిటీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పదో తరగతి ఆధారంగా పారామెడికల్‌ కోర్సులు ఉండగా, బీఎస్సీ డిగ్రీతో మొదటిసారిగా వీటిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల మరింత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సాంకేతిక నిపుణులు తయారుకానున్నారు. దీనివల్ల వైద్య సేవలు మరింత పటిష్టం కానున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థులకు ప్రైవేట్‌ రంగంలోనూ మంచి ఆఫర్లు ఉంటాయి. అలాగే విదేశాల్లోనూ డిమాండ్‌ ఉంటుందని కాళోజీ వర్గాలు చె­ప్పా­యి. ఈ నేపథ్యంలో మున్ముందు ఇతర ప్రభు­త్వ మెడికల్‌ కాలేజీలు సహా ప్రైవేట్‌ కాలేజీల్లోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.  

కోటా అభ్యర్థులు లేకుంటే ఓపెన్‌లోకి.. 
►మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వు చేశారు. ఈ కేటగిరీ అభ్యర్థులు లేకుంటే రిజర్వ్‌డ్‌ సీట్లు ఓపెన్‌ కేటగిరీకి వెళ్తాయి. వాటిని మెరిట్‌ ఆధారంగా కేటాయిస్తారు.  

►29 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తారు. అర్హతగల అభ్యర్థులు లేకుంటే, మిగిలిన సీట్లను తదు పరి సబ్‌–గ్రూప్‌ అభ్యర్థులకు కేటాయించవ­చ్చు. వారు కూడా అందుబాటులో లేకుంటే, ఓపెన్‌ కేటగిరీకి మారుస్తారు.  

►ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10% సీట్లు ఉన్నాయి. 

►ప్రతి కేటగిరీలో మహిళా అభ్యర్థులకు 33.3 శాతం కేటాయిస్తారు. 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు.  

►స్థానిక రిజర్వేషన్‌ 85 శాతం ఉంటుంది. 

►మెరిట్‌ జాబితాను బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పొందిన మార్కుల ఆధారంగా తయారుచేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారా కాదా అనేది కూడా చూస్తారు. పాత అభ్యర్థులకు అధిక మెరిట్‌ ఉంటుంది. 

►కోర్సు వ్యవధిలో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు విద్యార్థుల బదిలీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.  

►ఈ సంవత్సరం 860 సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం నేరుగా దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియెట్‌ మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో ఎంసెట్‌కుగానీ లేదా ఇతరత్రా ఏదైనా ప్రవేశ పరీక్షకు అనుసంధానిస్తారు. 

బీఎస్సీ హెల్త్‌సైన్సెస్‌ కోర్సులివీ..
►అనెస్థీషియా టెక్నాలజీ  
►ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ  
►కార్డియాక్‌ కార్డియో వాస్క్యూలర్‌ టెక్నాలజీ  
►రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ 
►ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ  
►న్యూరో సైన్స్‌ టెక్నాలజీ 
►క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ 
►రేడియాలజీ ఇమేజింగ్‌ టెక్నాలజీ  
►ఆడియోలజీ స్పీచ్‌ థెరపీ టెక్నాలజీ  
►మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌  
►న్యూక్లియర్‌ మెడిసిన్‌ 
►రేడియో థెరపీ టెక్నాలజీ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement