సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి తెలిపారు. 2020 తరహాలోనే 2021లో సంవత్సరమంతా కోవిడ్ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేశామని... వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సహా ఇతర శాఖల సమన్వ యంతో ప్రజలకు సేవలు అందించామన్నారు. దీంతో ప్రజల నుంచి పోలీసులకు మంచిపేరు లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలసి వార్షిక నేర నివేది క–2021ను డీజీపీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో సఫలీకృతమయ్యా మని, నేరాల నియంత్రణ, నేరస్తులను అరె స్టులో మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టురహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 2020లో లాక్‌డౌన్ నేపథ్యంలో నేరాలు తక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఏడాదితో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని వివరించారు. 2021లో జరిగిన హత్యలు, కిడ్నాప్‌లు సహా వివిధ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మొత్తం 1,32,906 కేసులు...
వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి.
98 మంది మావోయిస్టుల అరెస్ట్..
♦2021లో 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మరో 133 మంది లొంగిపోయారు. స్టేట్ కమిటీలో ఇంకా 100 ఉండగా వారిలో కేవలం 30 మందే తెలంగాణకు చెందిన వారు. మిగతా 70 మంది ఛత్తీస్‌గఢ్‌వాసులు. ఆ రాష్ట్రంతో కలసి మావోయిస్టులను కట్టడి చేస్తున్నాం.
38,812 మంది నేర నిర్ధారణ
♦2021లో మొత్తం 38,812 మంది నిందితు లు దోషులుగా నిరూపితం కాగా.. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. శిక్షల శాతం 48.5 నుంచి 50.3 శాతానికి చేరింది. పదేపదే నేరాలు చేస్తున్న 664 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం.
5 నిమిషాల్లోనే స్పాట్‌కు...
♦డయల్ 100 నంబర్‌కు వచ్చే కాల్స్‌కు పోలీసులు సత్వరం స్పందించాలనే లక్ష్యంతో రెస్పాన్స్ టైమ్‌ను గణిస్తున్నాం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 7 నిమిషాల్లో పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్‌కు చేరుకుంటున్నారు.
రూ. 53 కోట్ల విలువైన సొత్తు రికవరీ...
♦2021లో మొత్తం 17,429 దొంగతనాలు నమోదవగా రూ. 113 కోట్ల విలువైన సొ త్తు దొంగలపాలైంది. వాటిలో 7,682 కే సులను (44%) కొలిక్కి తెచ్చి రూ. 53 కో ట్ల (47%) విలువైన సొత్తు రికవరీ చేశాం.
838 జీరో ఎఫ్‌ఐఆర్‌లు...
♦నేరం జరిగినప్పుడు పరిధుల సమస్యతో బాధితుడు ఠాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా ఉండటానికి రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేపడుతున్నాం. 2020లో ఇలాంటి కేసులు 517 నమోదవగా 2021లో అవి 838కి పెరిగాయి. వాటిని ఆయా పరిధిల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నాం.
4 నెలల్లో ట్విన్ టవర్స్...
♦హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మి తమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 3–4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు.
రిటైరయ్యేలోగా ప్రతి పోలీసుకూ ఇల్లు
♦ప్రతి ఒక్కపోలీసుకు రిటైరయ్యే సమ యానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మా లక్ష్యం. దీనికి ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతిజిల్లాకు ఓ పోలీసు కల్యాణ మం డపం, అనువైన ప్రతిచోటా పెట్రోల్ బం కుల ఏర్పాటుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. సిబ్బందికి నామమాత్రపు వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment