‘ఓడ దిగాక బోడి మల్లన్న’ ..ఇదీ మోదీ సర్కార్‌ తీరు  | Telangana: Harish Rao Criticized Modi Government | Sakshi
Sakshi News home page

‘ఓడ దిగాక బోడి మల్లన్న’ ..ఇదీ మోదీ సర్కార్‌ తీరు 

Published Sun, Mar 27 2022 2:21 AM | Last Updated on Sun, Mar 27 2022 3:05 PM

Telangana: Harish Rao Criticized Modi Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న’సామెత చందంగా కేంద్రం లోని మోదీ సర్కార్‌ వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేశాం.

ఎన్నికలయ్యాక అదేవిధంగా ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం తన మోసపూరిత వైఖరిని మరోసారి చాటుకుంది’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 7న ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే’అని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త క్లిప్పింగ్‌ను తన ట్వీట్‌కు జత చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement