
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు చెప్పారు. విపక్ష సభ్యులు టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వంటి వారు కూడా తొలిసారి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను సభలో అభినందించడమే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
దార్శనికత, దక్షత కలిగిననేత: కవిత
దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, ధైర్యం ఉన్న నేత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలతో పాటు 25 సూచికల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలవటం గర్వకారణమన్నారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment