TSLPRB Released SI and Constable Physical Events Dates 2022 - Sakshi
Sakshi News home page

TS SI-Constable Events Dates 2022: తెలంగాణ పోలీస్‌ అభ్యర్థుల ఈవెంట్స్‌ తేదీలు ఖరారు

Published Sun, Nov 27 2022 11:27 AM | Last Updated on Mon, Nov 28 2022 4:08 PM

Telangana Police Events will be held on 8th december to 3rd January - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించింది. అభ్యర్థులకు ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లు డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈవెంట్స్‌ నిర్వహణకు గాను మొత్తంగా 11కేంద్రాలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎంపిక చేసింది.

ఈ మొత్తం ప్రక్రియను 25 రోజుల్లోపు పూర్తి చేయనున్నారు. శారీరక సామర్ధ్య పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులు నవంబర్‌ 29, ఉదయం 8గంటల నుంచి డిసెంబర్‌ 3, అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి www.tslprb.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

చదవండి: (AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. పోస్టుల వివరాలు ఇవే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement