కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ | Telugu celebs birthday wishes for KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

Published Sat, Jul 25 2020 4:10 AM | Last Updated on Sat, Jul 25 2020 4:10 AM

Telugu celebs birthday wishes for KTR - Sakshi

శుక్రవారం ప్రగతి భవన్‌లో పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు మొక్కను అందజేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌. చిత్రంలో ఆకుల లలిత, మాలోత్‌ కవిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు 44వ జన్మదినం సందర్భంగా శుక్రవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో పార్టీ నేతలు, ముఖ్యులు కేటీఆర్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చా రు. అయినా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు కేటీఆర్‌కు పూల మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీ శ్‌రెడ్డి, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాం త్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్, బీబీ పాటిల్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోత్‌ కవిత, వెంకటేశ్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, బాల్క సుమన్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దంపతులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

సినీ, క్రీడా, పారిశ్రామిక రంగ ప్రముఖులు..
సినీ, క్రీడా, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపు తూ ఆయనతో కలిసి ఉన్న ఫొటోలను ట్యాగ్‌ చేశారు. సినీ నటులు చిరంజీవి, పవన్‌ కళ్యా ణ్, మహేశ్‌బాబు, వెంకటేష్‌ దగ్గుబాటి, రామ్‌ చరణ్, రానా, నాని, ప్రకాశ్‌రాజ్, నితిన్, మంచు మనోజ్, లక్ష్మీ మంచు, సుధీర్‌ బాబు, లావణ్య త్రిపాఠి, హరీశ్‌ శంకర్, రాహుల్‌ సిప్లిగంజ్, తమన్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు క్రీడా ప్రముఖులు వీవీఎస్‌ లక్ష్మణ్, సైనా నెహ్వాల్, ప్రజ్ఞాన్‌ ఓజా, సిక్కిరెడ్డి, సుమిత్‌ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రతో పాటు టెక్‌ మహీంద్రా సీఈఓ గుర్నానీ, నాస్కామ్‌ అధ్యక్షుడు దేవయాని ఘోష్, యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్, యూకే డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

మొక్కలు నాటిన మండలి చైర్మన్‌ 
కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మొక్కలు నాటి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. గుత్తా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీ పటి ష్టత, ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కేటీఆర్‌ను ప్రస్తుత యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లు దామోదర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెస్‌ ప్రభాకర్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం 
కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్ర భుత్వ విప్‌ బాల్క సుమన్, పీ యూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి రక్తదా న శిబిరాన్ని ప్రారంభించారు. కా గా ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేష న్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గుప్తా కేటీఆర్‌ బాల్యం మొదలు కుని విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం, మంత్రిగా అభివృద్ధికి చేసిన కృషి తదితరాలతో వేసిన చిత్రా న్ని కేటీఆర్‌కు బహూకరించారు.

ఏపీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు ఏపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్‌ బ్రదర్‌ తారక్‌.. దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా’అని వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా ప్రతినిధులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేశ్, రజిని, రోజా సెల్వమణి, మార్గాని భరత్‌ రామ్, పేర్ని నాని, గంటా శ్రీనివాసరావు, భూమా అఖిల తదితరులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. 

రాక్‌స్టార్‌ లాంటి అన్నయ్యవి..: కవిత
‘మన ఇరుగుపొరుగు, దగ్గరివాళ్లు ఎవరిని తీసుకున్నా నీ చిన్ని చెల్లిగా నేను ఎంత అదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను. కానీ నీ పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నా.. రాక్‌స్టార్‌ లాంటి నీవు నా సోదరుడివి అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నా.. జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్యా’అంటూ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేయడంతో పాటు తమ బాల్యానికి సంబంధించిన ఫొటోను ట్యాగ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement