ఓటాయిలో పులి కలకలం | Tiger Moving In Kothaguda Forest Area Of Mahabubabad District | Sakshi
Sakshi News home page

ఓటాయిలో పులి కలకలం

Published Tue, Aug 31 2021 4:29 AM | Last Updated on Tue, Aug 31 2021 4:29 AM

Tiger Moving In Kothaguda Forest Area Of Mahabubabad District - Sakshi

కొత్తగూడ: మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి అటవీ ప్రాంతంలో పులి కదలికలు కలకలం సృష్టించాయి. కొత్తగూడ, తాడ్వాయి మండలాల సరిహద్దులోని మొసలి మడుగు వాగు సమీపంలో సోమవారం ఓ ఎద్దు కళేబరం కనిపించడంతో అటవీ అధికారులు దానిని పరిశీలించారు. పులి, పులిపిల్ల అడుగులను అక్కడ గుర్తించారు. పాద ముద్రలనుబట్టి రెండు రోజుల క్రితమే పులి ఆ ప్రాంతంలో సంచరించి నట్లు అంచనా వేశారు. దీంతో అటు వైపుగా పశువులను తీసుకెళ్లవద్దని ఫారెస్ట్‌ రేంజర్‌ వజ్రత్‌ స్థానికులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement