ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, కాకతీయ వారసుడు భంజ్‌దేవ్
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల చరిత్రను సవివరంగా తెలుసుకుంటుంటే సంతోషంతో పాటు బాధగా ఉందని, ఆ చరిత్ర ఇంకా మరుగున పడి ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వైభవ సప్తాహంలో భాగంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో టార్చ్ సంస్థ గురువారం ఏర్పాటు చేసిన కాకతీయ ఫొటో ఎగ్జిబిషన్‌ను కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్ చంద్ర బంజ్‌దేవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ కాకతీయ వారసత్వ సంపద మన రాష్ట్రంలో ఉందని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు కాకతీయ సంపదను పరిరక్షించలేకపోయాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించిందని, సంరక్షించాల్సింది ఇంకా ఉందని ఈరోజే తెలిసిందని చెప్పారు.
మన పూర్వీకులైన కాకతీయ రాజు ఈరోజు మళ్లీ ఓరుగుల్లుకు రావడంతో సంతోషకర విషయమన్నారు. మైనింగ్ పేరుతో ఈ సంపదను నాశనం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అరవింద్ ఆధ్వర్యంలోని టార్చ్ సంస్థ చేసిన కృషిని ప్రశంసించారు.
అదృష్టంగా భావిస్తున్నా...
కమల్ చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. తన పూర్వీ కుల నేలకు రావడం అదృష్టంగా భావిస్తున్నాన న్నా రు. కాకతీయులకు చెందిన విలువైన చారిత్రా త్మక సంపద ఇప్పటికీ తెలంగాణలో ఉందని, దానిని పరిరక్షించుకోవాలని సూచించారు. ఏడేళ్లు గా అరవింద్‌తో చర్చిస్తున్నానని, ఆయన పరిశోధ నతో కాకతీయులకు సంబంధించిన ఎన్నో విషయా లను తెలుసుకున్నానని చెప్పారు.
తన వంశానికి చెందిన రాజుల పేర్ల చివర ఇప్పటికీ కాకతీయ ఉంటుంద న్నారు. ఆ పూర్వవెభవాన్ని కాపాడేందుకు ఏం చేయ డానికైనా తాను సిద్ధమని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి కేటీఆర్‌తో చర్చించానని, కాకతీయుల సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment