న్యూఢిల్లీ: తెలంగాణ రైల్వేకు రికార్డుస్థాయిలో రూ. 5,336కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం అని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు.
తెలంగాణలో ప్రస్తుతం రూ. 32,946కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించామని అన్నారు. తెలంగాణలోనూ 100శాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని వెల్లడించారు. గడిచిన 10ఏళ్లలో 437ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందన్నారు.
దేశంలో రూ.1.9లక్షల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయనిఅశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment