
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో పద్మావతి
కోదాడ రూరల్: వచ్చే ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50 వేల కంటే ఒక్క ఓటు మెజార్టీ తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లులో జరిగిన ‘ఉత్తమన్న రైతు భరోసా యాత్ర’లో మాట్లాడారు.
తనకున్న సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. గుడిబండలో దళిత బంధులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment