
వివేకా హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను..
సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను మళ్లీ వాయిదా వేసింది సీబీఐ. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో రేపు(బుధవారం) ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది.
ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణ జరగాల్సి ఉంది. అయితే.. హైకోర్టులో విచారణ పూర్తికాలేదన్న విషయం కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ తరుణంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైతం కోర్టులోనే ఉండడంతో.. ఎవరు ప్రశ్నిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణను రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ, కోర్టుకు తెలియజేసింది.