
కేసు నమోదు చేసిన పోలీసులు
మూసాపేట: మహిళలకు రక్షణ కలి్పంచే షీటీమ్ వృత్తిలో ఉంటూ.. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఏఆర్ కానిస్టేబుల్, షీ టీమ్ డ్రైవర్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లో ఉంటున్న 36 ఏళ్ల నర్సింగ్ బాలానగర్ షీటీమ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వివేకానందనగర్‌లోని బంధువు ఇంటికి దశదిన కర్మ కోసం నర్సింగ్ వెళ్లాడు.
సెల్లార్‌లో మద్యం తాగుతూ అక్కడి బాత్‌రూంను ఉపయోగించుకున్నాడు. సెల్లార్‌లోనే ఇద్దరు యువతులు కిరాయికి ఉంటున్నారు. బాత్‌రూమ్ వాసన వస్తోందని సర్ఫ్ నీళ్లు చల్లడంతో నర్సింగ్ ఆ యువతులతో వాదనకు దిగాడు. మద్యం మత్తులో యువతిని చెంపపై కొట్టి, భుజంపై చేయి వేసి నెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment