
చండూరు: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు విరమిస్తారని సన్నాహక కమిటీ కన్వీనర్ ఇరుగు సునీల్ తెలిపారు.