శ్రీకాళహస్తి: దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణంపాలైన ఘటన శుక్రవారం తిరువణ్ణామలైలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌సీపీ గురుకులం సమీపంలో ఒరుగు దయాసాగర్‌రెడ్డి(58), మధుమతి(53) దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు డాక్టర్ సూర్యతేజరెడ్డి(33) ఉన్నారు. ఇతనికి డాక్టర్ మౌనికరెడ్డి(29)తో ఏడాది క్రితం వివాహమైంది.
గురువారం పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కారులో తిరువణ్ణామలైకు వెళ్లారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. అదేసమయంలో వేలూరు జిల్లా, ఒడుగత్తూరు నుంచి వస్తున్న మినీ వ్యాన్ కన్నమంగళం వద్ద కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దయాసాగర్‌రెడ్డి, డాక్టర్ సూర్యతేజరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.
డాక్టర్ మౌనిక, మధుమితతోపాటు మినీవ్యాన్‌లో వస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ మౌనిక మృతిచెందింది. మధుమతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా సూర్యతేజ చిత్తూరు అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య మౌనికరెడ్డి విజయనగరంలో హౌస్ సర్జన్. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment