తలకోనలో పోటెత్తిన భక్త జనం
తలకోన(భాకరాపేట): మహా శివరాత్రిని పురష్కరించుకుని తలకోనకు బుధవారం ఉదయమే భక్తులు పోటెత్తారు. వేకువజామున సిద్ధేశ్వరి సమేత శ్రీసిద్ధేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలోనే తలకోన ఝరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదిదంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆదిదంపతుల సేవలో పెద్దిరెడ్డి
తలకోన బ్రహ్మోత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిదంపతులను దర్శించుకున్నారు.
పట్టువస్త్రాల సమర్పణ
సిద్ధేశ్వరి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ పరమేశ్వరుని సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మహాదేవుని ప్రార్థించినట్లు వెల్లడించారు.
తలకోనలో పోటెత్తిన భక్త జనం
తలకోనలో పోటెత్తిన భక్త జనం
Comments
Please login to add a commentAdd a comment