సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
తిరుపతి క్రైమ్ : జిల్లాలో సారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి శాంపిళ్లు సేకరించాలని కోరారు. ఎక్కడైన అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయిని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని స్పష్టం చేశారు. నవోదయం 2.0ను విజయవంతం చేయాలని చెప్పారు.
తాగుబోతు వీరంగం
తిరుపతి మంగళం రోడ్డులోని ఓ బార్ వద్ద బుధవారం ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు.వివరాలు.. చంద్రశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన లోకేష్ అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగి నారా హంగామా చేశాడు. కానిస్టేబుళ్లు గంగాసాగర్, గోపీనాథ్ రెడ్డి అదుపు చేసేందుకు యత్నించగా తిరగబడ్డాడు. కానిస్టేబుల్ గంగాసాగర్‌పై దాడి చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment