రేపు తిరుపతిలో జాబ్ మేళా
తిరుపతి అర్బన్ : తిరుపతి నగరంలోని నాక్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పదోతరగతితోపాటు ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. ఆసక్తిగలవారు ఆధార్ కార్డుతోపాటు విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని రావాలని సూచించారు. ఈ మేరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 9703437472,9988853335 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ప్రాణదాన ట్రస్ట్‌కు భారీగా విరాళాలు
తిరుమల : టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు బుధవారం రూ.81 లక్షలు విరాళంగా అందాయి. చైన్నెకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.70 లక్షల విరాళం అందించింది. వర ఫ్యూచర్ ఎల్‌ఎల్పీ అనే సంస్థ రూ.11 లక్షలు అందజేసింది. దాతలు ఈ మేరకు చెక్‌లను టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందించారు.
పక్షుల కేంద్రంలో రైల్వే డీఆర్‌ఎం
దొరవారిసత్రం : నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని బుధవారం విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ సందర్శించారు. కడప చెట్లుపై విడిది చేసిన విహంగాల విన్యాసాలను కెమెరాతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా నేచర్ గైడ్ హుస్సేనయ్య మాట్లాడుతూ పక్షుల జీవన విధానాలను వివరించారు.
ఆదిలక్ష్మికి కాసులహారం
రాపూరు :పెంచలకోనలోని నృసింహుని ఆలయంలో ఆదిలక్ష్మీదేవికి బుధవారం బంగారు కాసుల హారాన్ని దాతలు బహూకరించినట్లు అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన గురుబెల్లి లక్ష్మీనారాయణ, చైతన్య దంపతులు 39 గ్రాముల బంగారు కాసుల హారాన్ని అందించినట్లు వివరించారు.
తిరుమల నాగతీర్థంలో ప్రత్యేక పూజలు
తిరుమల: తిరుమలలోని నాగతీర్థంలో కొలువైన పరమశివుడికి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశేష ప్రసాదాలను సమర్పించారు. ఈ క్రమంలోనే ఆదిదేవును దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అన్నదానం చేపట్టారు. సుమారు వెయ్యిమందికి అన్నప్రసాదాలు అందించినట్టు స్థానిక భక్తులకు అనిల్ తెలిపారు.
రేపు తిరుపతిలో జాబ్ మేళా
రేపు తిరుపతిలో జాబ్ మేళా
Comments
Please login to add a commentAdd a comment