
త్వరితగతిన సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు
తిరుపతి తుడా: స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.మౌర్య అధికారులను ఆదేశించారు. పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు గడువు లోపు పూర్తి చేయాలని, కార్యాలయంలోని అందరూ విభాగాధిపతులకు గదులు ఉండేలా చూడాలన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈఈ రవి, ఏఈ కాం ప్రతినిధులు బాలాజి, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment