
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రేణిగుంట: శ్రీకాళహస్తి మండలం, కాపుగున్నేరి సమీపంలోని ఓ సీతల పానీయం తయారీ కంపెనీ ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల కథనం.. శ్రీకాళహస్తి పట్టణం, బీపీ అగ్రహారానికి చెందిన పుచ్చకాలయ కిరణ్ మేర్లపాకలోని తన బంధువుల ఇంటికి వచ్చి, అక్కడి నుంచి బి.శరవణ కుమారుడు సాదుతేజ్(4)ను తీసుకుని ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తికి బయల్దేరాడు. కాపుగున్నేరి సమీపంలో ఓ కర్మాగారం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అదుపు తప్పి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై కూర్చున్న చిన్నారి సాదుతేజ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment