రైతుల సంక్షేమమే లక్ష్యం
తిరుపతి సిటీ: చిన్న, సన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా వెటర్నరీ వర్సిటీ పలు అంశాలపై అవగాహన కల్పిస్తోందని ఇన్‌చార్జ్ వీసీ జేవీ రమణ పేర్కొన్నారు. గురువారం వెటర్నరీ వర్సిటీ నిరంతర పశువైద్య విద్య, సమాచార కేంద్రం ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెంపకంపై రైతులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రంసంగించారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత, ప్రధాన శాస్త్రవేత బాలసుబ్రమణ్యం, విస్తరణ సంచాలకులు డాక్టర్ శోభామణి, కో–ర్డినేటర్ ప్రొఫెసర్ కే.సుజాత పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
నారాయణవనం: మండలంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టిన ప్రమాదంలో ఏసయ్య(57) మృతి చెందగా మురుగేశం(48)కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం.. మండలంలోని కసిమిట్టకు చెందిన ఏసయ్య, భీముని చెరువుకు చెందిన మురుగేశం ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి పని ముగించుకుని కంపెనీ బస్సులో పుత్తూరుకు వచ్చారు. అక్కడి నుంచి మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరారు. మండలంలో జాతీయ రహదారి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాళాశాల సమీపంలోకి వచ్చేసరికి ఇండికేటర్లు లేకుండా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. బైక్ నడుపుతున్న ఏసయ్య అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కుర్చున్న మురుగేశంకు తీవ్ర గాయాలయ్యాయి. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఏసయ్య మృతదేహాన్ని, వైద్యసేవల నిమిత్తం మురుగేశాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చస్తున్నట్టు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment