ఇంట్లో చోరీ
చంద్రగిరి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండల పరిధిలోని దిగువ కాశిపెంట్లలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బరామిరెడ్డి వివరాల మేరకు.. దిగువ కాశిపెంట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్‌చౌదరి ఇటీవల మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల తర్వాత కుటుంబ సభ్యులు బెంగళూరులో ఉంటూ తరచూ ఇక్కడకు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పైన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్దకు చేరుకుని ప్రధాన ద్వారం తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అపై పడక గదిలోని బీరువాలో ఉంచిన 26 గ్రాముల బంగారం, కొంత నగదు నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గౌరవవేతనం పెంచాల్సిందే
తిరుపతి సిటీ: వెటర్నరీ జూడాలకు గౌరవవేతనాన్నిపెంచాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. గత 25 రోజులుగా స్టైఫండ్ పెంచాలని వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న న్యాయ పోరాటానికి ఏపీ రైతు సంఘం, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. విద్యార్థుల న్యాయపోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇంట్లో చోరీ
Comments
Please login to add a commentAdd a comment