మునిగితేలారు!
భక్తి సాగరంలో..
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తేరువీధి, నెహ్రూవీధి, నగరివీధి, బజారువీధి భక్తులతో కిక్కిరిసిపోయాయి. హరహర మహాదేవ, శంభోశంకర అంటూ స్వామివారి రథాన్ని ముందుకు కదిలించగా.. జైజై కాళీ, జైజై భద్రకాళి నామాన్ని స్మరిస్తూ అమ్మవారి రథాన్ని ముందుకు నడిపించారు. రథోత్సవం సందర్భంగా భక్తులు ఉప్పు, మిరియాలను చల్లుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈఓ బాపిరెడ్డి, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ పాల్గొన్నారు.
వివక్షతోనే ఇక్కట్లు
మాజీ కౌన్సిలర్ ఆర్కాటు ముత్తు చాలా ఏళ్లుగా రథోత్సవంలో సేవలందించేవారు. కానీ ఆయన వైఎస్సార్‌సీపీ నాయకుడు కావడంతో కూటమి నేతలు కక్ష్య గట్టారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పంపకుండా అవమానించారు. ఈ క్రమంలో రథోత్సవానికి కొత్తవారిని నియమించుకున్నారు. వారు సకాలంలో బ్రేక్‌లు వేయకపోవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు.
తెప్పోత్సవం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతుల తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. విద్యుద్దీప కాంతుల్లో విహరిస్తున్న స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
మిల్లర్ల ఇష్టారాజ్యం
తిరుపతి జిల్లాకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రైస్ మిల్లులు ఎక్కువ. నెల్లూరు నగరం చుట్టూరా వంద నుంచి 150 రైస్ మిల్లులు ఉన్నాయి. తిరుపతి జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పది, శ్రీకాళహస్తిలో మరో పది రైస్ మిల్లులున్నాయి. తిరుపతి, చంద్రగిరిలో ఐదారు మిల్లులు ఉన్నాయి. అదే నెల్లూరులో ఇదొక పెద్ద ఇండస్ట్రీ లాగా ఉంది. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి నెల్లూరులో ఉన్న మిల్లులకే ధాన్యం వెళ్తుంది. రేషన్ బియ్యం కూడా నెల్లూరులోని కొన్ని మిల్లులకు వెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడులో ఇచ్చే రేషన్ బియ్యం (ఉప్పుడు బియ్యం) నెల్లూరు మిల్లులకే తరలిస్తున్నారు. నెల్లూరు అంటే మిల్లర్ల అడ్డాగా ఉంది.
మిల్లర్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. సీజన్ ప్రారంభంకాగానే కల్లాల్లో వాలిపోతున్నారు. రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ధాన్యాన్ని ఒకటికి సగానికి కొనుగోలు చేసి ఆపై మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యంగా ఆడించి మార్కెట్‌కు తరలించి రేట్లు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండకపోగా.. ఉక్కళంగా దోచుకెళ్తున్న మిల్లర్లు ఆడించే బియ్యానికి రోజురోజుకూ రేట్లు పెరుగుతుండడం గమనార్హం. దీనిపై అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
న్యూస్‌రీల్
అంగరంగ వైభవంగా శ్రీకాహస్తీశ్వరుడి రథోత్సవం రాత్రి తెప్పలపై విహరించిన సామి,అమ్మవార్లు
రథోత్సవంలో దొంగల చేతివాటం
రథోత్సవంలో దొంగలు తమచేతి వాటం ప్రదర్శించారు. తొట్టంబేడు మండలం, కంచనపల్లి గ్రామానికి చెందిన సుభాషిణి అనే మహిళ రథోత్సవానికి రాగా.. నగరి వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు తెంపుకుని వెళ్లారు.
నేడు శివపార్వతుల కల్యాణం
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల తర్వాత గజ వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, సింహ వాహనంపై జ్ఞానప్రసూనాంబదేవి బయలుదేరి పెండ్లి మండపం వద్దకు చేరుకోనున్నారు. అనంతరం సోమవారం వేకువ జామున స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు.
మునిగితేలారు!
మునిగితేలారు!
మునిగితేలారు!
మునిగితేలారు!
మునిగితేలారు!
మునిగితేలారు!
మునిగితేలారు!
Comments
Please login to add a commentAdd a comment