● సంక్షేమానికి అరకొర బడ్జెట్ ● నిరుద్యోగభృతి, ఉచిత బస్సు ఊసేలేదు ● సూపర్ సిక్స్‌కు చెక్ ● ప్రతినెలా ఒక్కో మహిళకు రూ.1,500పై చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ● జిల్లాలో తాగు, సాగునీటికి మొండి చెయ్యి ● బడ్జెట్‌పై నిప్పులు చెరుగుతున్న మేధావులు
తిరుపతి సిటీ: షరా మామూలే. సంక్షేమానికి మళ్లీ టోకరా పెట్టేశారు. అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మేధావులు, వామపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తిరుపతి జిల్లాకు తిరునామం పెడుతూ ఏ రంగంలోనూ బడ్జెట్ గణాంకాల్లో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం మాటవరుసకై నా జిల్లా ప్రస్తావన లేకపోవడంపై మండిపడుతున్నారు. గత ఏడాది 2024–25 బడ్జెట్‌లో ప్రస్థావించిన అంశాలను ఇంకాస్తా గణాంకాలు జోడించి అమలుకు వీలుకాని అంకెలను పొందుపరుస్తూ మంత్రి ప్రసంగం కొనసాగింది. దీనిపై రైతులు, మహిళలు నిప్పులు చెరుగుఉతన్నారు.
సూపర్ సిక్స్‌కు పంగనామం
2025–26 బడ్జెట్ గణాంకాలు మహిళలను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. గత బడ్జెట్‌లో సూపర్‌సిక్స్ పథకాలకు చోటివ్వని కూటమి ప్రభుత్వం ఈసారైనా కరుణించకపోతుందా అని ఎదురు చూసిన మహిళలకు నిరాశే మిగిలింది. మహిళాశక్తి పేరుతో కుటుంబంలోని ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందిస్తామని చెప్పి బడ్జెట్‌లో మాటెత్తకుండా మంగళం పాడేసింది. మహిళలకు ఉచిత బస్సు ఊసేలేదు. తల్లికి వందనం పథకానికి రూ.8వేల కోట్లు కేటాయిండంపై పెదవి విరుస్తున్నారు. తిరుపతి జిల్లాలోని సుమారు 3లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. బడ్జెట్‌లో కేటాయించిన సొమ్ములో కనీసం 30శాతం మందికి కూడా సరిపోదనే వాదనలు వినిపిస్తున్నాయి.
గిట్టుబాటు ధర ఏదీ?
జిల్లాలోని 2.51 లక్షల మంది రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రత్యేకంగా మంత్రి అచ్చెం నాయుడు అసెంబ్లీలో చదివిన గణాంకాలపై నోరెళ్లబెడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించకుండా నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. గత ప్రభుత్వం ధరలస్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణమని మండిపడుతున్నారు. అన్నదాత సుఖీభవకు గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయించి అములు చేయలేదు. మళ్లీ 2025–26 బడ్జెట్‌లో నిధులు కేటాయించడం చూస్తే కనీసం జిల్లాలోని సగం మందికి కూడా ఈ పథకాన్ని వర్తించే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment