పెళ్లి కళ
● కల్యాణానికి సిద్ధమైన స్వామి, అమ్మవార్లు ● పోటెత్తిన భక్తులు ● ఒక్కటైన జంటలు
వధూవరులకు
బంగారు తాళిబొట్లు
● బియ్యపు మధుసూదన్ రెడ్డి కానుక
శ్రీకాళహస్తి: శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా నూతన వధూవరులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం రాత్రి బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దాదాపు 20 ఏళ్లుగా పేదలకు బంగారు తాళిబొట్లు కానుకగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళి బొట్లు పంపిణీ చేశారు. ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నాయకులు పగడాల రాజు, కంటా ఉదయ్‌కుమార్, ఉత్తరాజీ శరవణకుమార్, సిరాజ్ బాషా, మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్, గరికపాటి చంద్ర , పఠాన్ ఫరీద్, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
పెళ్లి పందిరి
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం ఉదయం స్వామివారు అధికార నందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారు కామధేనువుపై దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెళ్లి కుమారుడిగా ముస్తాబైన శివయ్య గజవా హనంపై, జ్ఞానాంబిక సింహ వాహనంపై ఆశీనులై పెళ్లిమండపానికి వేంచేశారు.
పెళ్లి కళ
పెళ్లి కళ
పెళ్లి కళ
పెళ్లి కళ
పెళ్లి కళ
పెళ్లి కళ
Comments
Please login to add a commentAdd a comment