పింఛన్ల కోత.. పండుటాకులకు వాత!
9 నెలల్లో 8,722 పింఛన్ల తగ్గింపు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అభాగ్యులు, దివ్యాంగులు, పండుటాకులతో చెడుగుడు ఆడుతోంది. బతుకు జీవనానికి చుక్కానిగా ఉన్న పింఛన్లకు కోత విధిస్తూ రోడ్డున పడేస్తోంది. కొత్తపింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు తొలగించడం విమర్శలకు తావిస్తోంది. గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లా వ్యాప్తంగా 8,722 పింఛన్లను పక్కన పెట్టేసింది. గత ఫిబ్రవరిలో 2,63,191 మందికి పింఛన్లు ఇవ్వగా.. మార్చి నెల వచ్చేసరికి 2,62,461 మందికి పరిమితం చేసింది.
పింఛన్ల కోత ఇలా
నెల పింఛన్ల సంఖ్య
జూన్ 2,71,183
జూలై 2,69,162
ఆగస్ట్ 2,67,772
సెప్టెంబర్ 2,67,089
అక్టోబర్ 2,66,342
నవంబర్ 2,65,488
డిసెంబర్ 2,64,636
జనవరి 2,63,995
పిభ్రవరి 2,63,191
మార్చి 2,62,461
ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇవ్వండి
లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. శనివారం ఉదయం 7 నుంచే పింఛన్ల ప్రక్రియ మొదలు పెట్టాలి. మార్చి లో 2,62,461 మందికిగాను రూ.112.06 కోట్లు నగదు ఇవ్వాల్సి ఉంది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీఓలు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలి. –ఎస్.వెంకటేశ్వర్, కలెక్టర్, తిరుపతి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment