● ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు ● ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే భార్య మండిపాటు
తిరుపతి టాస్క్‌పోర్స్: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి అందజేశారు. ఈ విషయం ఎమ్మెల్యే భార్య వరకు చేరింది. వెంటనే విద్యాశాఖ అధికారులకు ఫోన్‌చేసి ‘2029 వరకు ఈ నియోజక వర్గానికి ఎమ్మెల్యే నా భర్త. మీకు భక్తి ఉంటే చెవిరెడ్డి ఇంటికెళ్లి పనిచేసుకోండి.. లేదంటే చంద్రగిరి నియోజకవర్గం వదలి వెళ్లిపోండి’ అంటూ విద్యాశాఖ అధికారులకు ఫోన్‌లో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. అంతే రాత్రికి రాత్రే చిన్నగొట్టిగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంకు జిల్లా విద్యాశాఖాధికారి నుంచి షోకాజ్ నోటీసు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment